హోమ్>epinastine
Epinastine
Epinastine గురించి సమాచారం
ఎలా Epinastine పనిచేస్తుంది
దురద, ఎలర్జీ, ఛాతీ బిగదీసుకుపోయి శ్వాస ఆడని పరిస్థితికి కారణమయ్యే రసాయనాలను Epinastine నిరోధిస్తుంది.
ఎపినస్టైన్ యాంటి హిస్టమైన్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది ఎలర్జీ లక్షణాలను కలిగించే సహజంగా ఉత్పత్తి అయ్యే పదార్థం, హిస్టమైన్ జీవ సంబంధ చర్యను నిరోధిస్తుంది మరియు తద్వారా ఎరుపుదనం, దురద, కండ్లను కప్పి ఉంచే పొర వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Common side effects of Epinastine
దురద
Epinastine నిపుణుల సలహా
- ఎపినాస్టైన్ వాడుతున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడవద్దు.
- అలాగే ఎపినాస్టైన్ చుక్కలు కంట్లో వేసుకునే ముందు మీ కాంటాక్ట్ లెన్స్ తీసేసి, మళ్లి తర్వాత ధరించండి. లేకుంటే లెన్స్ రంగు మారే అవకాశం ఉంది.
- ఎపినాస్టైన్ వాడిన తర్వాత మరొక కంటి చుక్క వాడ వలసి వస్తే, కనీసం 10 నిమిషాల వ్యవధి ఇవ్వండి.
- ఎపినాస్టైన్ వాడకం ఆపేసే ముందు వైద్యుని సంప్రదించండి. ఎందుకంటే ఈ మందు క్రమం తప్పకుండా వాడితేనే ఎలర్జీ తో కూడిన కండ్ల కలకని అదుపు చేయగలదు.
- మీరు గర్భవతి అయినా, గర్భధారణ ప్రణాళిక ఉన్నా, లేక చనుబాలు యిస్తున్నా, ఆ విషయం వైద్యునికి చెప్పండి.
- ఎపినాస్టైన్ కంటి చుక్కలు ఇంజక్షన్ ద్వారా గానీ, నోటి ద్వారా ఇవ్వడానికి ఉద్దేశింపబడలేదు.
- ఎపినాస్టైన్ 12 ఏళ్ళ లోపు పిల్లలకి మరింత జాగ్రత్తగా ఇవ్వాలి.