Pegaptanib
Pegaptanib గురించి సమాచారం
Pegaptanib ఉపయోగిస్తుంది
Pegaptanibను, వయస్సు సంబంధిత దృష్టి విఘటన తడిరూపం (కంటిలోని రక్తనాళాలు అసాధారణ ఎదుగుదల కారణంగా క్రమేపీ దృష్టి లోపానికి దారితీయడం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Pegaptanib పనిచేస్తుంది
Pegaptanib కన్నులోని ఒక రసాయనంతో కలిసి దాని పనితీరును నిరోధించి కంటి రక్తనాళాల వాపును నిరోధించి, కంటిచూపును కాపాడుతుంది.
పెగాప్టనిబ్ అనేది వాస్కులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫాక్టర్ (VEGF) కు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాల తరగతికి చెందినది. పెగాప్టనిబ్ కణబాహ్య VEGFతో జట్టకట్టడం ద్వారా తడి AMD ఉన్న రోగులలో శాశ్వత దృష్టి లోపానికి దారితీసే కళ్ళలో అసాధారణ రక్త నాళాల ఎదుగుదల మరియు లీకేజును నిలిపివేస్తుంది.
Common side effects of Pegaptanib
కంటిలో బాహ్య వస్తువులకు సున్నితత్వం, కంటిలోపలి ఒత్తిడి పెరగడం, కంటి నొప్పి, పంక్టాట్ కిరాటిసిస్, దృష్టి ఇబ్బందులు, కంటి వాపు, కళ్లు సలపడం, రక్తపోటు పెరగడం, కార్నియల్ ఎడెమా, కంటి దురద, కళ్ల నుంచి రక్తస్రావం, కంటిలో మండుతున్న భావన, కంటి నుంచి విడుదల
Pegaptanib మెడిసిన్ అందుబాటు కోసం
MacugenPfizer Ltd
₹445711 variant(s)
Pegaptanib నిపుణుల సలహా
- కళ్లు ఎర్రబడినా, వెలుతురుని తట్టుకోలేకపోతున్నా, చూపులో మార్పు సంభవించినా వెంటనే నేత్రవైద్యుడిని సంప్రదించాలి.
- పెగాప్టానిబ్ ఇన్ట్రావైట్రియల్ ఇన్జెక్షన్ తీసుకున్నవారు వెంటనే వాహనాలను నడపడం గానీ, ఇతర సాంకేతిక పనిముట్లపై పనిచేయడంగానీ చేయరాదు. ఎందుకంటే.. ఈ మందు డ్రైవింగ్ సామర్ధ్యంపై ప్రభావం చూపుతుంది.
- గర్భిణులు, తల్లికావాలనుకుంటోన్న వారు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు పెగాప్టానిబ్ తీసుకునే ముందు... వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.